ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది మృతి

Screengrab Twitter:

చైనాలోని గిజావ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది అక్కడికక్కడే ఈ మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైవేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా గాయపడిన 20 మందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version