కామన్వెల్త్ క్రీడల్లో రెండో రోజు భారత్ పతకాల వేట మొదలైంది. వెయిట్ లిఫ్టింగ్ లో భారత క్రీడాకారులు 3 పతకాలు సాధించారు. 49 కేజీల విభాగంలో మీరాభాయి ఛానూ స్వర్ణం సాధించింది. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ రజతం గెలిచాడు. ఒక్క కేజీ తక్కువ ఎత్తి త్రుటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం నెగ్గాడు.