• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వృద్ధుడి కిడ్నీలో 3వేల రాళ్లు..!

    AP: సాధారణంగా కొందరికి మూత్రపిండంలో రాళ్ల వంటి అవశేషాలు ఏర్పడుతుంటాయి. ఒకటో, రెండో అంటే ఈజీగా వాటంతటవే తొలగిపోతాయి. కానీ, ఓ వ్యక్తికి ఏకంగా 3వేల రాళ్లు బయటపడ్డాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలానికి చెందిన ఓ వృద్ధుడి మూత్ర పిండంలో ఈ రాళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఈ రాళ్లను తొలగించారు. కీ హోల్ సర్జరీ ద్వారా ఈ ఆపరేషన్‌ని చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో రాళ్లు ఏర్పడటం చాలా అరుదని వారు వెల్లడించారు.