మందుల ధరలపై 30-40శాతం తగ్గించిన కేంద్రం

© Envato

రాష్ట్రంలో బీపీ, షుగర్ రోగులకు కేంద్రం తీపికబురు అందించింది. మందుల ధరలపై 30-40 శాతం మేర ధరలు తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(NPPA) ఉత్తర్వులు జారీ చేసింది. మధుమేహం, రక్తపోటుతో పాటు జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండెపోటు, పక్షవాతం, నొప్పుల మందులపై ధరలు తగ్గనున్నాయి. సవరించిన ధరల మేరకే ఆయా మందులను అమ్మాలని NPPA ఆదేశాలు జారీ చేసింది. ఇవే ఔషధాలను వేర్వేరు ఫార్ములాలతో కొత్తగా మార్కెట్లోకి తేవాలనుకుంటే.. ప్రభుత్వ అనుమతి పొందాలని స్పష్టం చేసింది. కాంబినేషన్ డ్రగ్స్ కు కూడా ప్రభుత్వం ముకుతాడు వేసింది.

Exit mobile version