తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల ఉద్యోగాల్లో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. బుధవారం పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలకు జోవోలు రిలీజ్ చేసింది. వీటిలో ఎక్కువగా పోలీస్ శాఖలో 16,587, మెడికల్ సర్వీస్ బోర్డులో 10,028, వైద్య ఆరోగ్య శాఖలో 2,662, గ్రూప్-1లో 503, జైళ్ల శాఖలో 154, రవాణా శాఖలో 149 పోస్టులున్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) కూడా నిర్వహించేందుకు ఆమోదం లభించింది. దీంతో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నియామక సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే ఉగాది పండుగ(ఏప్రిల్ 1) రోజున వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయని తెలుస్తోంది.