ప్రముఖ అమెరికన్ సింగర్ రాబర్ట్ సిల్వస్టర్ కెల్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే లైంగిక వేదింపుల కేసులో న్యూయార్క్ కోర్టు తాజాగా కెల్లీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మీ టూ సమయంలో ఈ సింగర్పై చాలా ఆరోపణలు వచ్చాయి. అతడు పాపులర్ సింగర్ కావడంతో మీకు కెరీర్లో సాయం చేస్తానని చెప్పి మమ్నల్ని లొంగదీసుకున్నాడని చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పారు. దీనిపై అతడిని దోషిగా నిర్ధారించిన న్యూయార్క్ కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. కెల్లీని 30 ఏళ్లు జైల్లో పెట్టాలని తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ కెల్లీ తరఫున న్యాయవాదులు మళ్లీ అప్పీల్ చేయబోతున్నట్లు చెప్పారు.