దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అటు ఈడీ, ఇటు సీబీఐ జోరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా పరిగణిస్తూ ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రుపై ఈడీ 3వేల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ని దాఖలు చేసింది. మరికొందరు నిందితులపైనా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉందని పేర్కొంది. ఈ ఛార్జ్‌షీట్‌పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పేపర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, పరిగణనలోకి తీసుకోవడానికి టైం పడుతుందని పేర్కొంది. మరోవైపు, ఇదే కేసుపై సీబీఐ 10వేల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ని న్యాయస్థానానికి సమర్పించింది. హైదరాబాద్‌కి చెందిన అభిషేక్‌తో సహా ఏడుగురిని నిందితులుగా చేర్చింది.