31 పైసలు చెల్లించలేదని రైతుకు సర్టిఫికెట్ ఇవ్వని బ్యాంకు

© Envato

ఓ రైతు 31 పైసల బకాయిని చెల్లించనందుకు SBI బ్యాంకు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో అతడు తన పొలాన్ని అమ్ముకునేందుకు చిక్కులు ఏర్పడ్డాయి. వివరాల ప్రకారం..గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగర సమీపంలో ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ తనకున్న కొద్ది పొలం మీద ఎస్బీఐ బ్యాంకులో రూ.3 లక్షల పంటరుణం తీసుకున్నాడు. ఆ పొలాన్ని రాకేశ్ వర్మ, మనోజ్ వర్మలకు విక్రయించడానికి ముందే ఆ రుణాన్ని చెల్లించాడు. దీంతో భూ రిజిస్ట్రేషన్‌కి వెళ్తే నో డ్యూ సర్టిఫికెట్ అడిగారు. సదరు రైతు బ్యాంకును ఆశ్రయించగా 31 పైసల బకాయి ఉందని సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో భూ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసును విచారించి SBI బ్యాంకు తీరుపట్ల అగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు మేనేజర్ హాజరుకావాలని తీర్పును తదుపరి విచారణకు వాయిదా వేసింది.

Exit mobile version