దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలయ్యాయి. నిన్న 700 పాయింట్లకుపైగా సెన్సెక్స్ లాభపడగా.. నేడు మాత్రం సూచీలు స్వల్ప వృద్ధితో కొనసాగుతున్నాయిు. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న సానుకూల పరిణామాలు సహా పలు అంశాల కారణంగా మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. దీంతో ఒక దశలో BSE సెన్సెక్స్ 196 పాయింట్లు, NSE నిఫ్టీ 58 పాయింట్లు పెరిగింది. బ్యాంకింగ్ స్టాక్స్ భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.