హైదరాబాద్‌లో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

© Envato

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు కూడా ఈవీలకు అలవాటు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రజలకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ రెడ్కో(తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ పరిధిలో 230 లొకేషన్లు, హెచ్ఎండీఏ పరిధిలో 100 లొకేషన్లలలో ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు లొకేషన్ల జాబితాను GHMC అధికారులు, రెడ్కో అధికారులకు అందజేశారు. వారు ఈ జాబితాను పరిశీలించే స్టేషన్లను ఏర్పాట్లు చేయనున్నారు.

Exit mobile version