ఏపీ: కంటి వెలుగు మూడో విడత కార్యక్రమంలో 35,42,151 మందికి కంటి పరీక్షలు చేయనున్నట్లు వైద్యారోగ్యమంత్రి విడదల రజిని అన్నారు. ఇందుకోసం 376 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఆరు నెలల్లో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్స నిర్వహిస్తామన్నారు. అలాగే కంటి అద్దాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 104 సేవల కింద కొత్తగా 146 అంబులెన్సులు వస్తున్నందున పాత వాటిని ‘మహాప్రస్థానం’ వాహనాలుగా ఉపయోగించే విషయాన్ని అధికారులు పరిశీలించాలని మంత్రి సూచించారు.