తెలంగాణలో ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రబుత్వం కొత్త పోస్టులు భర్తీ చేయనుంది. 3,897 పోస్టులను భర్తీకీ అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. ఒక్కో మెడికల్ కాలేజీకి 433 పోస్టులు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.సిరిసిల్ల, ఖమ్మం, భూపాలపల్లి, వికారాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, నిర్మల్, జనగాం, కరీంనగర్ మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణలో 3,897 పోస్టుల భర్తీ

Courtesy Twitter: CMO TELANGANA