మైక్రోటియా అంటే చెవులు బయటకు అభివృద్ది చెందకపోవడం. పుట్టుకతోనే ఈ వైకల్యంతో బాధపడుతున్న మెక్సికోకి చెందిన 20 ఏళ్ల అమ్మాయికి 3డీ ప్రింటెండ్ చెవిని అమర్చారు. ప్రపంచంలోనే ఇటువంటి శస్త్రచికిత్స చేయడం ఇది తొలిసారి. 3డీ బయో థెరప్యూటిక్స్ నిపుణులు ఆమె మరో చెవి నుంచి కణజాలాన్ని సేకరించారు. అచ్చు కుడివైపు చెవి మాదిరిగానే సహజంగా కనిపించే ‘ఆరినోవో’అనే 3డీ టెక్నాలజీ ని ఉపయోగించి మరో చెవిని తయారుచేసి ఆమెకు అమర్చారు.