బిహార్లో ప్రతి ఏటా నిర్వహించే పెరుగు తినే పోటీల్లో ఓ వృద్ధుడు రికార్డు సృష్టించాడు. ఏకంగా మూడున్నర కిలోలకు పైగా పెరుగును మూడు నిమిషాల్లో తినేశాడు.పురుషులు, మహిళలు, సీనియర్ సిటిజన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో 500 మంది పాల్గొన్నారు. పురుషుల విభాగంలో బార్హ్కు చెందిన అజయ్ కుమార్ 3 కిలోల 420 గ్రాములు తిని విజేతగా నిలిచాడు. సీనియర్ సిటిజన్లో శంకర్ కాంత్ 3kg 647gms, మహిళలల్లో ప్రేమ తివారీ 2kg 718gm తిని గెలుపొందారు.