పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌లో మెుదటి రోజు పరుగుల వరద పారించిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 657 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 506 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్ సేన..తొలి ఓవర్లోనే వికెట్ సమర్పించుకుంది. బెన్ స్టోక్స్ వెనుదిరిగిన తర్వాత బ్రూక్ కాసేపు మెరుపులు మెరిపించాడు. 151 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ప్లేయర్లందరూ వరుస కట్టారు.అయినా ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి.