పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కంబాట్ హెలికాప్టర్ మొదటి ఉత్పత్తిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ సెప్టెంబర్లో ఆర్మీకి అందజేసింది. మరో నాలుగు హెలికాఫ్టర్లు ఈ నెలలో అందించాల్సి ఉంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం హెలికాఫ్టర్లు అందితే, నవంబర్ మొదటి వారంలో వాటిని విధుల్లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. కాగా 2017 ఆగష్టులో LCH ఉత్పత్తిని ప్రారంభించారు.