రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ (రిటైర్డ్) వీకీ సింగ్ లను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపాలని కేంద్రం నిర్ణయించింది. అయితే సింధియా రొమేనియా, మోల్డోవా వైపు వెళ్లనుండగా, రిజిజు స్లోవేకియాకు వెళ్లనున్నారు. హంగేరీకి హర్దీప్ సింగ్, జనరల్ (రిటైర్డ్) సింగ్ పోలాండ్కు చేరనున్నారు. తరలింపు ప్రక్రియను సమీక్షించేందుకు సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.