బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగిసేలా కనిపిస్తోంది. భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన శ్రీలంక ఇప్పటికే సగం వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే (86 నాటౌట్) ఒక్కడే పోరాడుతున్నాడు. కుశాల్ మెండిస్(54) పరుగులు చేసి వెనుదిరిగాడు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా, జడేజా, బుమ్రా, అక్షర్ పటేల్ తలోవికెట్ తీశారు. శ్రీలంక విజయానికి ఇంకా 268 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం స్కోరు 185/6. కరుణరత్నే, లసిత్ ఎంబుల్దేనియా క్రీజులో ఉన్నారు.