ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు గత నెలలో తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మే 22న మ.2.30 గంటల ప్రాంతంలో దాదాపు 4 టన్నుల భారీ పేలుడు పదార్థాలతో 9 సెకన్లలో భూస్థాపితం చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు ఎడిఫైస్ అనే ఇంజనీరింగ్ సంస్థ కూల్చివేత పనులను నిర్వహించనుంది. ఈ భవనానికి సమీపంలో నివసిస్తున్న దాదాపు 1,500 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించనున్నారు. దగ్గర్లో ఉన్న నోయిడా ఎక్స్ప్రెస్వే ను సైతం మూసివేయనున్నారు. పేలుడు ధాటికి శిథిలాలు బయటికి ఎగిరిపోకుండా చుట్టూ మూడు లేయర్ల వైర్డ్ మిషన్ ను అమర్చనున్నారు.