ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ HCL త్వరలో 40 వేల మంది ప్రెషర్లను నియమించుకోనుందని సీఈవో సి.విజయ కుమార్ తెలిపారు. అలాగే రానున్న 3 నుంచి 5 ఏళ్లలో నియర్షోర్ ప్రాంతాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని వెల్లడించారు. 2022-23 ఏడాదిలో టెలికాం, లైఫ్ సైన్సెస్, ఆర్థిక సేవల్లో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఎలాంటి ప్రభావం మా సంస్థపై పడలేదని సీఈవో వివరించారు.