• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశంలో 3 నెలల తర్వాత మళ్లీ 4 వేలు దాటిన కరోనా కేసులు

    దేశంలో గత 24 గంటల్లో 4,041 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 4,000 మార్కును దాటింది. దీంతో యాక్టివ్ కేసులు 20,000 మార్కును దాటి 21,177కి చేరుకున్నాయి. కరోనా కారణంగా మరో 10 మంది మృతి చెందగా, మొత్త మరణాల సంఖ్య 5,24,651కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో వెయ్యికి పైగా కేసులు రికార్డయ్యాయి.