చిన్న పొరపాటుకు 41 మంది బలి

© Envato

బంగ్లాదేశ్ లో ఓ అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి చిన్న పొరపాటు కారణమైంది. అగ్నిప్రమాదం జరిగిన డిపోలో కంటెయినర్లలో రసాయనాలు నిల్వ చేశారు. అందులో ఉన్న రసాయనంపై నీరు పడితే పేలుడు సంభవిస్తుంది. కానీ వాటిపై వేసిన లేబుల్స్ తప్పుగా వేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది నీటితో మంటలార్పేందుకు ప్రయత్నించగా భారీ పేలుడు సంభవించింది. ఇందులో అగ్నిమాపక సిబ్బంది సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version