మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 4,255 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 20,634కి చేరుకుంది. అంతేకాదు కరోనా కారణంగా మరో ముగ్గురు మరణించినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. కొత్తగా 2,879 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించారు. మహారాష్ట్రలో రికవరీ రేటు 97.87% ఉండగా, మరణాల రేటు 1.86% ఉందని వెల్లడించారు. అయితే రికార్డైన కేసుల్లో ముంబై పరిధిలోని ప్రాంతాల్లోనే 3,718 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు.