ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 43 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఖవాజా (180; 422 బంతుల్లో 21 ఫోర్లు ) సెంచరీ చేశాడు. ఈ క్రమంలో భారత గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 1979లో ఆసీస్ దిగ్గజ ఆటగాడు గ్రాహం యాలోప్ 392 బంతులు ఆడాడు. ప్రస్తుతం ఖవాజా 422 బంతులు ఎదుర్కొని యాలోప్ రికార్డును బద్దలు కొట్టాడు. వీరిద్దరి తర్వాత స్టీవ్ స్మిత్ (361 బంతులు) ఉన్నాడు.