రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలతో తెలంగాణ ప్రభుత్వానికి న్యూఇయర్ కిక్కు ఇచ్చింది. డిసెంబరు 30, 31 తేదీల్లో రూ.470 కోట్ల మద్యం అమ్ముడుపోయిందని ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. గత ఆరు రోజుల్లో రూ.1,111.29 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది అధికమని వెల్లడించింది. డిసెంబరు 31, 2021న రూ.171.93 కోట్ల మద్యం అమ్ముడైందని.. ఈ దఫా రూ.216 కోట్లు వచ్చాయని పేర్కొంది. అత్యధికంగా డిసెంబరు 30(శుక్రవారం)న రూ.254 కోట్ల మద్యం అమ్ముడుపోయిందని పేర్కొంది. కాగా, డిసెంబరు 31 రోజున మద్యం విక్రయ వేళలను ప్రభుత్వం పెంచింది.