దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం 5 రోజుల లాభాల ధోరణిని మార్చేశాయి. మళ్లీ సూచీలు నష్టాల వైపు పరుగులు తీశాయి. ఉక్రెయిన్పై యుద్ధం చేసినందుకు రష్యాపై EU కొత్త ఆంక్షలు విధించిన మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న US ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ సమావేశంపై కూడా ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో సెన్సెక్స్ 709 పాయింట్లు తగ్గి 55,776.85 వద్ద, నిఫ్టీ 225.10 పాయింట్లు క్షీణించి 16,646.20 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఆసియాలో, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, హాంకాంగ్, షాంఘైలో షేర్లు డౌన్లో ఉండగా, జపాన్లో ఫ్లాట్ నోట్లో ముగిశాయి.