• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 5 రాష్ట్రాల రిజల్ట్స్ ఎఫెక్ట్.. 817 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

    దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సహా పలు అంశాల కారణంగా మార్కెట్లు పుంజుకున్నాయి. ముగింపులో సెన్సెక్స్ 817.06 పాయింట్లు పెరిగి 55,464.39 వద్ద, నిఫ్టీ 249.50 పాయింట్లు పెరిగి 16,594.90 వద్ద స్థిర పడ్డాయి. దాదాపు 2,346 షేర్లు లాభాలవైపు పయనించగా, 937 షేర్లు క్షీణించాయి. బ్యాంకు నిఫ్టీ కూడా 660 పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు హెచ్‌యూఎల్, టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ షేర్లు వృద్ధి చెందాయి. ఇక కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీ, టీసీఎస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.