ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50కోట్ల మంది వాట్సాప్ డేటా లీక్ అయినట్లు ‘సైబర్‌న్యూస్’ సంచలన కథనం వెలువరించింది. ఈ 50 కోట్ల ఫోన్ నెంబర్లను హ్యాకర్లకు అమ్మకానికి పెట్టారంటూ అందులో పేర్కొంది. యూజర్ల ఫోన్ నెంబర్లతో 2022కి చెందిన డేటాబేస్‌ని అమ్మనున్నట్లు ఓ హ్యాకర్ ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడని కథనంలో పేర్కొంది. ఈ జాబితాలో భారత్ కూడా ఉండటం ప్రస్తుతం కలవర పెడుతోంది. అత్యధికంగా ఈజిప్టు దేశానికి చెందిన 4.5కోట్ల కాంటాక్టులు అమ్మకానికి రెడీగా ఉన్నాయని పేర్కొంది. అనుమానాస్పద కాల్స్ వస్తే స్పందించొద్దని కథనంలో సూచించింది.