తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛనుదారులకు లబ్ధి చేకూరేలా 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.2,128 కోట్లు కేటాయించింది. అలాగే వచ్చే ఏడాది నుంచి 57 ఏళ్లు దాటిన వారికి కూడ పింఛన్లు అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితాను పరిశీలించి లబ్ధిదారుల పేర్లు వెల్లడిస్తామని పేర్కొంది. ఆసరా పింఛన్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.800 కోట్లు ఖర్చు చేస్తుంది.