ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యారు. దీంతో కలిపి 30 ఏళ్లలో 57 సార్లు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు కార్యదర్శిగా ఉన్న ఖేమ్కాను..అదే హోదాతో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగారాకు బదిలీ చేశారు. కొన్ని రోజుల క్రితం సీఎస్‌కు అశోక్ రాసిన లేఖనే ట్రాన్స్‌ఫర్‌కు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్యాశాఖలో విలీనం చేయడంతో పనిలేకుండా పోయిందని.. ఐఏఎస్‌కు వారానికి 40 గంటల పని ఉండాలన్నారట.