దేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం మరింత జాప్యం కానుంది. ముందుగా అనుకున్నట్టు ఈ నెలాఖరులోగా వేలం పూర్తయి, జూన్ నుంచి పనులు అనుకున్నారు. కానీ టెలికాం, టెక్ కంపెనీల భిన్నాభిప్రాయాల కారణంగా ఈ వేలం మరింత ఆలస్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీల డిమాండ్ పరంగా ఇప్పటికే ఈ వేలానికి సంబంధించిన నివేదికను ట్రాయ్ రూపొందించగా..దానిని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ ఆమోదించింది. దీనిని క్యాబినెట్ ఆమోదించిన తరువాత వేలానికి సంబంధించిన నోటీసులు జారీ చేయనున్నారు.