త్వరలో దేశంలోకి 5G నెట్వర్క్ రాబోతుంది. 72 గిగా హెడ్జ్ రేడియో వేవ్స్ ను ఈ నెల 26 నుంచి వేలం వేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ బిడ్ సదస్సును నేడు కేంద్రం నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా సుమారు రూ. లక్ష కోట్లను ప్రభుత్వం సేకరించనుందని తెలుస్తోంది. రిజర్వ్ ప్రైస్ ను 40 శాతం మేర తగ్గించాలని ట్రాయ్ ఇప్పటికే ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ వేలం సక్సెస్ అవుతుందని టెలీ కమ్యూనికేషన్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.