అక్టోబర్ కల్లా దేశంలో 5జీ సేవలు

© ANI Photo

దేశంలో 5జీ సేవలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సోమవారం విజయవంతంగా స్పెక్ట్రమ్ వేలం ముగిసిన సంగతి తెలిసిందే. 40 రౌండ్లలో రూ.1,50,173 కోట్లు బిడ్డింగ్ చేశారు. 71 శాతం స్పెక్ట్రం వేలంలో అమ్ముడైందని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఆగస్టు 10 కల్లా కంపెనీలకు స్పెక్ట్రం కేటాయింపులు పూర్తవుతాయని, అక్టోబర్ నాటికి దేశంలో 5జీ సేవలు మొదలవుతాయని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలంలో ముఖేష్ అంబానీ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.

Exit mobile version