తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. తమిళుల పెరటాసి మాసంలో మూడో శనివారం సందర్భంగా అక్కడి నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్లోని గో గర్భం డ్యాం వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దాదాపు 6 కిలోమీటర్లు భక్తులు బారులు తీరారు. భక్తజనం సంయమనం పాటించాలని..అన్ని వసతులూ కల్పిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
తిరుమలలో 6 కిలోమీటర్ల క్యూలైన్

© ANI Photo(file)