యూట్యూబ్‌లో వీడియోలు చూసి గూగుల్‌లో రూ.60లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించారు రావూరి పూజిత. గుంటూరు కేఎల్ యూనివర్సిటీకి చెందిన పూజిత కోడింగ్‌పై ఆసక్తితో ఈ ఉద్యోగం సంపాదించారు. కోవిడ్19 సమయంలో కాలేజీలో చేరిన పూజిత.. రెండో సెమిస్టర్ నుంచి ఆన్లైన్ క్లాసులు విన్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. కొన్ని కోడింగ్ వెబ్సైట్లను సందర్శించి పూజిత ప్రిపేర్ అయ్యారు. టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆన్లైన్ అసెస్మెంట్లు, మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు. ఇలా పట్టు సాధించి గూగుల్‌లో రూ.60లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించారు. అమెజాన్, అడోబ్లలో వచ్చిన రూ.45లక్షల ఆఫర్‌ని వదులుకున్నారు.