మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నదికి సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఈ క్రమంలో బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో హుగ్లీ-బంగాళాఖాతం సంగమించే చోటు ‘గంగాసాగర్’ కు రెండు పడవల్లో యాత్రికులు బయల్దేరారు. ఉన్నట్టుండి ఆచోట ‘ఆటు’(నీరు తగ్గడం) సంభవించడంతో ఆ పడవలు బురదలో కూరుకుపోయాయి. దీంతో పడవల్లోని దాదాపు 600మంది సందర్శకులు సముద్రంలో చిక్కుకుపోయారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి హోవర్ క్రాఫ్ట్‌లను ఘటనా స్థలానికి పంపించారు. కాగా, సంక్రాంతి రోజున ‘గంగా సాగర్’ని దాదాపు 51లక్షల మంది సందర్శించారు.