దేశంలో కొత్తగా 6,395 కరోనా కేసులు నమోదు

© File Photo

దేశంలో కొత్తగా 6,395 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,78,636కి చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసులు 50,342కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో మరో 33 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,28,090కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.70 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉంది.

Exit mobile version