తెలంగాణ‌లో మ‌రో 677 కానిస్టేబుల్ పోస్టులు

© ANI Photo

తెలంగాణ‌లో ఎక్సైజ్, ర‌వాణా కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 677 పోస్టుల్లో 614 ఎక్సైజ్, 63 ర‌వాణా విభాగంలో ఖాళీలు ఉన్నాయి.. ఇటీవ‌లే పోలీసు శాఖ‌తో పాటు, ఎస్‌పీఎఫ్‌, జైళ్ల శాఖ‌లో16,614 పోస్టుల నియామ‌కానికి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వాటితో పాటే తాజా పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు పోలీసు నియామ‌క మండ‌లి ప్ర‌క‌టించింది.
– వ‌య‌సు: 2020 జులై 1 నాటికి 18 ఏళ్లు
– అర్హ‌త: ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుకు ఇంటర్మీడియట్‌
– రవాణా కానిస్టేబుల్‌: ఇంటర్మీడియట్‌తో పాటు లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌
– ద‌ర‌ఖాస్తు తేది: మే 2 నుంచి 20వ తేదీ వరకు
– పూర్తి నోటిఫికేష‌న్ కోసం visit website పై క్లిక్ చేయండి.

Exit mobile version