దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(జూన్ 6న) నష్టాలతో ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ ఒక దశలో 320 పాయింట్లు క్షీణించి, 55,543 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు NSE నిఫ్టీ కూడా 90 పాయింట్లు పతనమై 16,500 పాయింట్లకు చేరింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ధోరణులు, US ద్రవ్యోల్బణం, యూరోపియన్ యూనియన్ పాలసీ వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.