ఈత కొట్టేందుకు నదికి వెళ్లిన ఏడుగురు అమ్మాయిలు నీటిలో మునిగి చనిపోయిన ఘటన తమిళనాడులో తమిళనాడులో చోటుచేసుకుంది. వీళ్లు అందరూ 18 ఏళ్ల లోపు అమ్మాయిలే కాగా అందులో ఇద్దరు అక్కాచెల్లెళ్లు, మిగతావాళ్లు స్నేహితులు. తమిళనాడు కెడలూరు వద్ద కెడిలం నదిలో స్నానం చేసేందుకు వెళ్లిన వీళ్లు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో అందులో మునిగి చనిపోయారు. వారి అరుపులు విని స్థానిక ప్రజలు వెళ్లి బయటకు తీసి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించారు.