హైదరాబాద్‌లో 7 టూంబ్స్ వెళ్లే టోలిచౌకి రహదారిని 20 రోజులపాటు మూసివేయనున్నారు. రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ, తవ్వకాల కారణంగా దారి మళ్లిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. జనవరి 12 నుంచి 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. నానల్ నగర్ జంక్షన్ నుంచి 7 టూంబ్స్ , గోల్కోండ కోట, అల్క్ఫౌరి కాలనీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను టోలీ చౌకీ ఫ్లై ఓవర్,కేఎఫ్‌సీ, షేక్‌పేట్ నాలా జంక్షన్ ఎడవైపునకు మళ్లిస్తున్నారు. వాహనాదారులు గమనించాలని పోలీసుల సూచించారు.