ఏపీలో ఏటా 70 వేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ !

© ANI Photo

పర్యావరణాన్ని కలుషితం చేస్తూ మానవాళికి సవాలుగా మారిన ప్లాస్టిక్.. ప్రపంచాన్ని భూతంలా పట్టుకుంది. రోజురోజుకు పెరుగుతున్న వినియోగంతో పుడమి తల్లి కలుషితం అవుతోంది. ప్లాస్టిక్ నివారణకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం ప్లాస్టిక్ వాడకం పెరుగుతూనే ఉంది. ఒక్క 2020-2021 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 70 వేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో సుమారు 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ గుర్తించినట్లు వారు వెల్లడించారు. పరిస్థితి ఇలానే ఉంటే.. భూకాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version