నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. నైగర్ నదిలో వెళ్తున్న ఓ పడవ ఒక్కసారిగా పోటెత్తిన వరదను తట్టుకోలేక బగ్బారూ ప్రాంతంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 76 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 85 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 76 మంది మృతదేహాలు వెలికితీశామని వెల్లడించారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు.