ఎక్కువసార్లు బదిలీ అయిన ఐఏఎస్‌గా పేరున్న అశోక్ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. రోజులో ఎనిమిది నిమిషాలుండే పనికోసం తనకు సంవత్సరానికి రూ. 40 లక్షలు చెల్లిస్తున్నారని హరియాణా ప్రభుత్వానికి లేఖ రాశారు. అవినీతి నిర్మూలించటానికి స్టేట్ విజిలెన్స్ విభాగం బాధ్యతలు అప్పగించాలని కోరారు. “ నన్ను ఆర్కైవ్స్ విభాగానికి బదిలీ చేశారు. దీని వార్షిక బడ్జెట్ రూ. 4 కోట్లు. ఆ మెుత్తం 0.0025 శాతం కంటే తక్కువే. కానీ, నాకు అందుతున్న జీతం రూ. 40 లక్షలు. అంటే బడ్జెట్లో 10 శాతం” అన్నారు.