ఆస్ట్రేలియాలో మైనింగ్ చక్రవర్తిగా పేరొందని జార్జినా హోప్ రెన్హార్ట్ తమ ఉద్యోగులకు భారీ క్రిస్మస్ కానుక అందించారు. ఒక్కొక్కరికి ఏకంగా లక్ష డాలర్లు అంటే రూ.80లక్షలకు పైగానే బోనస్ ప్రకటించారు. రెన్హార్ట్ 34 బిలియన్ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలోని కుబేరుల జాబితాలో ఒకరు. బోనస్ అందుకున్నవారిలో 3 నెలల క్రితమే కంపెనీలో చేరిన ఉద్యోగి కూడా ఉన్నాడు. గత ఏడాదిలో రెన్హార్ట్ కంపెనీ 3.3 బిలియన్ డాలర్ల లాభాల్ని అర్జించిందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.