సైబరాబాద్లో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. అయితే వీటి బారిన పడింది చదువుకోని వారు కాదు. ఏకంగా ఐటీ డిగ్రీ చేసినవారని తేలింది. క్రిప్టో కరెన్సీ, క్రెడిట్ కార్డు, ఫెక్ స్కీమ్ల పేరుతో సైబరాబాద్ పరిధిలో 70 కేసులు నమోదైతే వాటిలో 80 శాతం టెక్కీలే మోసపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే చదువుకున్న వారు మోసాల బారిన పడరనేది అపోహ మాత్రమేనని అంటున్నారు. క్రిప్టో యాప్లో వరుసగా ఓ వ్యక్తి రూ.10.2 లక్షలు, రూ.3.8 లక్షల పొగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా అనేక రకాల ఫిర్యాదులు తమకు అందినట్లు అధికారులు వివరించారు. ఫోన్ చేసి మాయమాటలు చెప్పి మన సమాచారంతో డబ్బులు లాగేస్తారని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.