జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. మన దేశంలో దాదాపు 80 శాతం కుటుంబాలు తమకు కనీసం ఒక్క మగ బిడ్డ అయినా ఉండాలని కోరుకుంటున్నారట. కొడుకు తమ వారసత్వాన్ని నిలబెడతాడని భావిస్తున్నారట. అలాగే గతంతో పొలిస్తే ఈసారి ఆడబిడ్డలు కావాలనుకునే వారి శాతం కూడ పెరిగిందని నివేదికలో వెల్లడైంది. దేశంలో తొలిసారి అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది పుట్టడం విశేషం.