దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

© File Photo

దేశంలో కోవిడ్ కేసులు దాదాపు 2 నెలల తర్వాత తొలిసారిగా 10 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆగస్టు 16న దేశంలో కొత్తగా 8,813 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసులు 1,11,252కు చేరాయి. మరో 29 మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,27,098కు పెరిగింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

Exit mobile version