దేశంలోని పారిశ్రామిక రంగం తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలోని 10,655 సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ మేరకు పార్లమెంట్‌కు కేంద్రం ఇటీవల వెల్లడించింది. గడిచిన 9 ఏళ్లలో 8.86 లక్షల కంపెనీలు మూతపడినట్లు పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. రోజుకు సగటున 270 కంపెనీలు మూతపడుతున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రోత్సాహకాలు లేకపోవడం వల్లే 87% పరిశ్రమలు క్లోజ్ అవుతున్నట్లు వివరిస్తున్నాయి.