చైనాలో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చింది. ఆ దేశ జనాభాలో దాదాపు 90 కోట్ల మందికి కోవిడ్ సోకినట్లు పేకింగ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. గాన్సూ రాష్ట్రంలో 91శాతం ప్రజలకు, యువాన్ రాష్ట్రంలో 84శాతం మందికి కరోనా సోకింది. చైనాలో కొత్త సంవత్సరం వేడుకలు దగ్గరపడుతుండటంతో చాలా మంది ప్రజలు పట్టణాల నుంచి గ్రామాల వైపు రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీంతో కోవిడ్ గ్రామలకు వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 2-3 నెలలు కోవిడ్ వ్యాప్తి గరిష్ఠ స్థాయిలో ఉంటుందని వెల్లడించారు.